కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడి సన్మానించిన యువకులు..

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లోని భీమ్‌గల్ మండలం బడా భీమ్‌గల్ గ్రామంలోని ఇటీవల కాంగ్రెస్ పార్టీ నూతనంగా గ్రామ శాఖల ఎన్నికల నిర్వహించారు. ఎన్నికల్లో బడా భీమ్‌గల్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా దాకటి.స్వామిని నియమించారు. నియమించిన సందర్భంగా శనివారం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ యువకులు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే గ్రామ యువకులు మాట్లాడుతూ.. గత పది సంవత్సరాల నుండి పాటి పైన ముఖంతో పనిచేస్తూ ముందుకు వస్తున్న వారికి గుర్తింపుగా పదవులు ఇవ్వడం అభినందనీయం అని అన్నారు. ఇలాగే కాంగ్రెస్ పార్టీకి కష్ట కాలంలో జెండా మోసిన నాయకులకు పదవులు ఇస్తూ గుర్తించాలని అన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన గ్రామ శాఖ అధ్యక్షుడు దాకటి. స్వామి, మాట్లాడుతూ, కాంగ్రెస్ అధిష్టానం నాపై నమ్మకంతో గ్రామ శాఖ అధ్యక్షుడు పదవి నియమించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీకి గ్రామానికి నమ్మకంతో పనిచేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో రాజేష్, భాను, బన్నీ, శ్రీకాంత్, రాజు, రాజన్న, రాజేందర్, శ్రీకాంత్, రాము, నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు.