ఇద్దరు సర్పంచులు కాంగ్రెస్‌ పార్టీలో చేరిక..

బాల్కొండ, ఆంధ్రప్రభ : నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలంలోని బస్సాపూర్‌, శ్రీరాంపూర్‌ గ్రామాల సర్పంచులు పోలంపల్లి శ్రీనివాస్‌, నల్లగొండ పద్మతో పాటు శ్రీరాంపూర్‌ ఉపసర్పంచ్‌ విలాస్‌ గురువారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి ముత్యాల సునీల్‌కుమార్‌ సమక్షంలో ఈ చేరిక కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి సర్పంచులుగా ఎన్నికైన అనంతరం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం బాల్కొండ మండల అధ్యక్షుడు గుండేటి మోహన్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు జాపు భూమన్న, రవీందర్‌గౌడ్‌, మల్లయ్య, ఎర్రన్న, చిన్నయ్య, చరణ్‌, వినోద్‌, రాకేష్‌, మహబూబ్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.