సిద్ధాంతంలో జనం పరవళ్లు

సిద్ధాంతంలో జనం పరవళ్లు

సీఎం చంద్రబాబు సభకు పోటెత్తిన జనం

భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం పెనుగొండ మండలం సిద్ధాంతంలో నిర్వహించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొని రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు.

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర ప్రధాన భూపరిపాలన కమిషనర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. జయలక్ష్మి, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, అచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు తదితరులు హాజరయ్యారు.

సిద్ధాంతంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం రైతులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. హెలిప్యాడ్, పార్కింగ్ ప్రాంతం, క్యాడర్ మీటింగ్ వేదిక, రైతుల సమావేశ ప్రదేశాలు చంద్రబాబు సమావేశం కోసం సిద్ధం చేశారు.

భూములకు రాజముద్రలతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు ముఖ్యమంత్రి స్వయంగా పంపిణీ చేయనున్నారు.