TDP | రాజ్యసభ అభ్యర్థులు ఖరారు..

TDP | రాజ్యసభ అభ్యర్థులు ఖరారు..

  • సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్‌కు అవకాశం
  • రాజ్యసభ అభ్యర్థులకు బీ-ఫారంలు అందజేసిన చంద్రబాబు

అమరావతి, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. పార్టీ అధిష్ఠానం విస్తృత కసరత్తు అనంతరం సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ పేర్లను రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారు చేసింది. కాగా, ఈ ముగ్గురు అభ్యర్థులు సోమవారం తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు, గౌరవం దక్కుతుందని అధిష్ఠానం భరోసా ఇచ్చింది. రాజ్యసభలో రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా సమస్యలను సమర్థంగా ప్రస్తావించే నాయకత్వాన్ని పంపించడమే లక్ష్యంగా ఈ ఎంపికలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇక, అభ్యర్థుల ఖరారుతో టీడీపీలో రాజ్యసభ ఎన్నికల సందడి ప్రారంభమైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే అభ్యర్థులకు బీ-ఫారంలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభలో రాష్ట్ర ప్రయోజనాలు, పార్టీ విధానాలను సమర్థంగా వినిపిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.