Andala Rakshasi | రీ-రిలీజ్ కు రెడీ అయిన మ‌రో క్లాసిక్ !

టాలీవుడ్ లో రీ-రిలీజ్ ల ట్రెండ్ బాగా పెరిగింది. పాత సినిమాలను రీ-రిలీజ్ చేస్తూ.. నోస్టాల్జియాను ఆస్వాదించే ట్రెండ్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో క్లాసిక్ కూడా చేరింది.

హను రాఘవపూడి ద‌ర్శ‌క‌త్వంలో 13 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాన్ని సాధించలేకపోయినప్పటికీ, కాలక్రమంలో ‘కల్ట్ క్లాసిక్’గా ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది.

ఈ చిత్రంలో నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించ‌గా.. సినిమా టేకింగ్, రాధన్ స్వరపరిచిన మ్యూజిక్, డైలాగ్స్, ఎమోషనల్ డెప్త్ సినిమాను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాయి.

ఇప్పుడు, ఈ హృదయాలను తాకే ప్రేమ కథ చిత్రం జూన్ 13న మళ్లీ థియేటర్లలోకి అడుగుపెట్టబోతోంది.

Leave a Reply