Iran US talks : మాట్లాడుకుందాం Andhra Prabha Spl Story
Iran US talks : మాట్లాడుకుందాం Andhra Prabha Spl Story
నేరుగా రావచ్చు
- ఫోన్ చేయొచ్చు
- ఇరాన్ నేతలకు అమెరికా ఆహ్వానం
- రష్యాలో అరాఘ్చీ
- పుతిన్ తొ భేటీ
- పాకిస్థాన్, ఒమన్ పర్యటనలపై వివరణ
- హోర్ముజ్ లో అదేస్థితి
- లెబనాన్‌లో ఆగని దాడులు
- ప్రపంచ మార్కెట్ల కుదేలు
- ఇరాన్ కొత్త మెలిక
( ఆంధ్రప్రభ, మాస్కో ప్రతినిధి)

అమెరికాతో యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ దౌత్యపర ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌తో చర్చల కోసం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి సోమవారం సెయింట్ పీటర్స్బర్గ్కు చేరుకున్నారు. ఇంతలోనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్ నేరుగా అమెరికాతో చర్చలు జరపవచ్చని, లేదా ఫోన్ చేయవచ్చని ఆయన తన సోషల్ మీడియా ఖతాలో ఇరాన్ నాయకులను కోరారు. ఇక రష్యాలో విదేశాంగ శాఖ మంత్రి అరాఘ్చీ మాట్లాడుతూ, “యుద్ధంలోని పరిణామాలను చర్చించడానికి ఈ సమావేశం ఒక మంచి అవకాశం” అవుతుందని ఆయన అన్నారు. “ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై టెహ్రాన్, మాస్కోల మధ్య సన్నిహిత సంప్రదింపులను కొనసాగించే లక్ష్యంతో రష్యాకు వచ్చానని ఆయన చెప్పారు.

ఈ రోజు తరువాత రష్యా అధ్యక్షుడితో తన సమావేశం “యుద్ధంలోని పరిణామాలను చర్చించడానికి, తాజా పరిస్థితిని సమీక్షించడానికి ఒక మంచి అవకాశం అవుతుంది” అని ఆయన అన్నారు. “ఈ విషయంలో ఇరు దేశాల మధ్య ఈ సంప్రదింపులు, సమన్వయం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయని విశ్వసిస్తున్నట్టు వివరించారు. సెయింట్ పీటర్స్బర్గ్కు చేరుకున్న అనంతరం మీడియాతో ఆరాఘ్చీ మాట్లాడుతూ, పాకిస్తాన్, ఒమన్ దేశాల్లో తన పర్యటనల గురించి వివరించారు. ఇస్లామాబాద్ పర్యటన “చాలా ఫలవంతమైనదని, “మంచి సంప్రదింపులు” జరిగాయని అరాఘ్చీ తెలిపారు. ఈ సంప్రదింపులలో అధికారులు షగత ఘటనలను ఇరాన్, అమెరికాల మధ్య చర్చలు ఏ నిర్దిష్ట పరిస్థితులలో కొనసాగవచ్చో సమీక్షించారు. అని ఆయన తెలిపారు. ఒమన్ పర్యటన సందర్భంగా, ఇరుపక్షాలు హోర్ముజ్ జలసంధిపై చర్చలు జరిపినట్లు అరాఘ్చి తెలిపారు.

ముఖ్యంగా ఈ జలసంధి గుండా సురక్షిత ప్రయాణం ఒక ప్రధాన ప్రపంచ సమస్యగా మారినందున, “హోర్ముజ్ జలసంధికి ఇరాన్, ఒమన్ రెండు తీరప్రాంత దేశాలు. అందువల్ల పరస్పర సంప్రదింపులు అవసరం, ఆయన అన్నారు. ఇరాన్, ఒమన్‌ల మధ్య “అధిక స్థాయిలో ఏకాభిప్రాయం” ఉందని, “నిపుణుల స్థాయిలో సంప్రదింపులు కొనసాగించాలని” ఇరుపక్షాలు అంగీకరించాయని అరాఘ్చి తెలిపారు.
Iran US talks : లెబనాన్ లో ఆగని హింస
అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్‌పై బాంబుల వర్షం కొనసాగిస్తున్నాయి. ఈ దాడిలో ఆదివారం ఇద్దరు చిన్నారులతో సహా 14 మంది మృతి చెందారు.
పాకిస్థాన్‌లో చర్చలకు తన రాయబారుల పర్యటనను అమెరికా రద్దు చేసిన ఒక రోజు తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, ఇరాన్ నాయకులు చర్చలు జరపాలనుకుంటే “మా వద్దకు రావచ్చు, లేదా ఫోన్ చేయవచ్చు” అని అన్నారు.
Iran US talks : హోర్ముజ్ లో అధే స్థితి

ఇక హోర్ముజ్ జలసంధిలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ వ్యూహాత్మక జలమార్గంలో యుద్ధానికి ముందున్న పరిస్థితుల్ని పునరుద్ధరించటానికి తాము అనుమతించేది లేదని ఇరాన్ సీనియర్ చట్టసభ సభ్యుడు అలీ నిక్జాద్ అన్నారు.ఇరాన్-అమెరికా చర్చలు స్థంభించిన నేపథ్యంలో చమురు ధరలు పెరిగాయి, బ్రెంట్ క్రూడ్ ధర 2 శాతానికి పైగా పెరిగింది. ఆసియా మార్కెట్లు కుదేలయ్యాయి.ఇరాన్ ఓడరేవులపై తమ బలగాలు దిగ్బంధనాన్ని కొనసాగిస్తున్నాయని, 38 నౌకలను వెనక్కి మళ్లించినట్టు అమెరికా సైన్యం తెలిపింది. దక్షిణ లెబనాన్‌లోని కాఫ్రా పట్టణ ప్రవేశద్వారంపై ఇజ్రాయెల్ బలగాలు బాంబులు వేయడంతో, అక్కడికి వెళ్లే రహదారి స్థంభించింది.
Iran US talks : ఇరాన్ కొత్త మెలిక

హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్ కొత్త షరతులను ప్రతిపాదించినట్టు అంతర్జాతీయ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరచి, యుద్ధాన్ని ముగించటానికి ఇరాన్ ఒక కొత్త ప్రతిపాదనను అమెరికాకు అందించినట్లు ఓ వార్తా సంస్థ పేర్కొంది. “అణు చర్చలను తదుపరి దశకు వాయిదా వేయడం” ఈ ప్రతిపాదనలో భాగమని తెలిపింది. పాకిస్తానీ మధ్యవర్తుల ద్వారా ఇరాన్ ఈ ప్రతిపాదన చేసిందని సమాచారం. హోర్ముజ్ జలసంధిపై ఒక ఒప్పందానికి రావడం , ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తివేయడం వల్ల, ఇరాన్ తన వద్ద ఉన్న సుసంపన్న యురేనియం నిల్వలను వదులుకునేలా చేయడానికి, కనీసం ఒక దశాబ్దం పాటు యురేనియం సుసంపన్నతను నిలిపివేస్తే అమెరికాకు ఎటువంటి బలం మిగలదు” అని మీడియా సంస్థలు హెచ్చరించాయి.
ALSO READ : 2026 Us Shooting News : గన్ డ్రామా Andhra Prabha Top Story
