Bengaluru Crime | ప్రియుడు అరెస్ట్.. తల్లి పరారీలో
Bengaluru Crime | ప్రియుడు అరెస్ట్.. తల్లి పరారీలో
Bengaluru Crime | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : కర్ణాటక రాజధాని బెంగళూరులో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఐదేళ్ల వెన్నిల అనే చిన్నారిని ఆమె తల్లి ప్రియాంక, ప్రియుడు మోహన్ కలిసి హత్య చేసినట్లు ఆరోపణలు రావడం సంచలనం రేపుతోంది. మార్చి 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
చిన్నారి మరణంపై పోస్టుమార్టం నివేదికతో పాటు ఓ విదేశీ వైద్యుడు అందించిన సమాచారంతో చిన్నారి తండ్రి ప్రవీణ్‌కు అనుమానం కలిగింది. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా ప్రియాంక, మోహన్ సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. వారి వ్యక్తిగత సంబంధాల కారణంగానే ఈ దారుణ ఘటన జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మోహన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు చిన్నారి తల్లి ప్రియాంక పరారీలో ఉండగా, ఆమె కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి నిజాలు వెలుగులోకి తెచ్చేందుకు పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
