Thorrur | ఉప సర్పంచ్‌ల చెక్ పవర్ తొలగింపు ఆలోచన విరమించుకోవాలి

Thorrur | ఉప సర్పంచ్‌ల చెక్ పవర్ తొలగింపు ఆలోచన విరమించుకోవాలి

  • దీకొండ సుధాకర్ గౌడ్

తొర్రూరు, ఆంధ్రప్రభ: ఉప సర్పంచ్‌ల చెక్ పవర్‌ను తొలగించే ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఉప సర్పంచ్‌ల ఫోరం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దీకొండ సుధాకర్ గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉప సర్పంచ్‌ల చెక్ పవర్‌ను రద్దు చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని కోరారు.

గ్రామపంచాయతీల అభివృద్ధిలో ఉప సర్పంచ్‌లు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి అధికారాలను తగ్గించే చర్యలు సరైనవి కావని అన్నారు. ఉప సర్పంచ్‌లకు తగిన గౌరవం కల్పించడంతో పాటు గౌరవ వేతనం ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఉప సర్పంచ్‌లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఐక్య పోరాటాల ద్వారానే హక్కులు సాధించుకోవడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. చెక్ పవర్ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమ కార్యాచరణ చేపట్టి ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.