గ్రామదేవత ఆశీస్సులు కోరిన ఎమ్మెల్యే నరేంద్ర వర్మ
బాపట్ల, ఆంధ్రప్రభ : బాపట్ల పట్టణంలోని ఇమ్మడిశెట్టి వారి పాలెంలో జరుగుతున్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి కొలుపుల సంబరాల్లో శనివారం రాత్రి బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పూలమాలలు, టెంకాయలు సమర్పించారు.
గ్రామదేవతల సంబరాలు మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకలని పేర్కొన్న ఆయన, ఇలాంటి వేడుకలు భావితరాలకు సంప్రదాయాలను అందించడంలో కీలకమన్నారు. గ్రామస్తులు, కళాకారులను అభినందించిన ఎమ్మెల్యేకు కనక తప్పట్లు, మేళతాళాల మధ్య ఘన స్వాగతం లభించింది. ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ చాపల సుబ్రమణ్యం, గ్రామ పెద్దలు కార్యక్రమాన్ని నిర్వహించారు.
