Bapatla | డిప్యూటీ స్పీకర్‌ను కలిసిన బీజేపీ నేతలు..

ఆకివీడు రామాలయ కేసు విజయంపై శుభాకాంక్షలు


Bapatla | బాపట్ల, ఆంధ్రప్రభ :
ఆకివీడు రామాలయానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ కొట్టివేయబడిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణం రాజును బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఇవాళ‌ ఉదయం తాడేపల్లిలోని డిప్యూటీ స్పీకర్ నివాసంలో బాపట్ల నియోజకవర్గం పిట్టలవానిపాలెం బీజేపీ మండల అధ్యక్షుడు అక్కల రామిరెడ్డి ఆధ్వర్యంలోని బృందం ఆయనను కలిసి అభినందించింది. ఈ సందర్భంగా ఆలయ పరిరక్షణ కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరినీ బృంద సభ్యులు అభినందించారు. సుప్రీంకోర్టు తీర్పు భక్తుల్లో ఆనందాన్ని నింపిందని, రామాలయ పరిరక్షణకు ఇది కీలక విజయమని వారు పేర్కొన్నారు.