పెద్ద కాపర్తిలో జల్ సంచయ్ – జన్ భాగీదారీ…

చిట్యాల, ఆంధ్రప్రభ : గ్రామంలోని ప్రతి ఒక్కరూ రానున్న రోజుల్లో మొక్కలు నాటి,వర్షపు నీటిని ఒడిసి పట్టిభావితరాలకు మంచి వాతావరణం కలిపిద్దామని సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు కాటం వెంకటేశం గ్రామ ప్రజలకు ఇచ్చారు.చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలోశుక్రవారం నాడుప్రజా పాలన పట్టణ ప్రగతి ప్రణాళిక కార్యక్రమం భాగంగా జల్ సంచాయి,జన్ భగీదారి కార్యక్రమాన్ని సర్పంచ్ కాటం ప్రారంభించారు. అనంతరం గ్రామ ప్రజలను ఉద్దేశించి సర్పంచ్ మాట్లాడుతూ.. రాబోయే వర్షాకాలంలో వర్షం నీటిని ఒడిసి పట్టడంవల్ల కలిగే లాభాలను వివరించారు.

నీటి గుంటల వినియోగం వర్షపు నీటి సంరక్షణ ఇంకుడు గుంతలు వీటి నిలువ కందకాలు,మట్టి కట్టలు సేద్యపు కుంటలవల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ భూగర్భ జలాలు పెరిగే విధంగా ప్రయత్నం చేయాలని అధికారులతో కలిసి ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా గ్రామపంచాయతీ దగ్గర ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పాలకవర్గముతో కలిసి మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో ఏవో శ్రీలత,టీఏ సునీత,పంచాయతీ సెక్రెటరీ ఆర్ కృష్ణయ్య, ఉప సర్పంచ్ ఓర్చు సైదులు,వార్డు సభ్యులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.