రైతులకు ఉపయోగపడే జలధార జలహారతి..
రైతులకు ఉపయోగపడే జలధార జలహారతి..
రాప్తాడు , ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార జల హారతి పథకం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతోందని మైనర్ రాప్తాడు మైనర్ ఇరిగేషన్ ఏఈ కృష్ణ కుమార్ పేర్కొన్నారు. గురువారం రాప్తాడు మండల పరిధిలోని మరూరు గ్రామం నందు జల ధార జల హారతి లో భాగంగా మైనర్ ఇరిగేషన్ ట్యాంకు (చెరువు)లో పూడికతీత పనులు ప్రారంభించినారు. ఈ సంధర్భంగా ఇరిగేషన్ ఏఈ క్రిష్ణ కుమార్ మాట్లాడుతూ గ్రామంలో రైతుల పొలాలకు వెళ్లే దారులకు ఇరువైపులా కంపచెట్లను తొలగించడం కాలువలలో పూడిన మట్టిని తొలగించడం చెగురు ఉన్న ఏరియాలలో చిన్న మధ్య రకం రాళ్లు మట్టిని తొలగించడం వలన ప్రజలకు రైతులకు ఎంతో మేలు జరుగుతోందని అన్నారు.
ఉపాధి హామీ కూలీలతో గ్రామ చెరువులో పూడిక తీసిన మట్టిని రైతుల పొలాల్లో వేసుకుంటే భూములు సారవంతమై నాణ్యమైన మంచి పంటలు పండేందుకు పంట అధిక దిగుబడి వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉందన్నారు. నేలలు మునుపటిలాగే శక్తి వంతంగా సారవంతంగా తయారవుతాయి.ట్రాక్టర్లు ఉన్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.అలాగే పేద రైతులకు కూడా మట్టిని తొలే విషయంలో సహాయం చెయ్యాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలోఏపీఓ ఏ.సావిత్రి పిఎసిఎస్ సొసైటీ చైర్మన్ గోపాల్ నాయుడు సాగునీటి సంఘం అధ్యక్షులు చాపట్ల విజయకుమార్ టెక్నికల్ అసిస్టెంట్ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ రైతులు ప్రజలు పాల్గొన్నారు.
