పార్టీ కోసం సైనికుల్లా పని చేద్దాం

పార్టీ కోసం సైనికుల్లా పని చేద్దాం

ప్రజల్లో మమేకమై పార్టీని బలోపేతం చేయాలి: మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్

భీమవరం, ఆంధ్రప్రభ: టీడీపీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తూ ప్రజల్లో మమేకమై పార్టీని బలోపేతం చేయాలని టీడీపీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్ పిలుపునిచ్చారు.

భీమవరం పట్టణ టీడీపీ కార్యాలయంలో రాజ్యసభ మాజీ సభ్యురాలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్ తోట సీతారామలక్ష్మి ఆదేశాల మేరకు క్లస్టర్లు, కో-క్లస్టర్లు, యూనిట్ ఇన్‌చార్జ్‌లు, బూత్ ఇన్‌చార్జ్‌ల సమావేశాన్ని బుధవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి నెల మొదటి బుధవారం యూనిట్ పరిధిలో బూత్ కన్వీనర్లు, కో-కన్వీనర్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, యూనిట్ పరిధిలోని సొసైటీ అధ్యక్షులు, నీటి సంఘాల అధ్యక్షులు, ఆలయ కమిటీల సభ్యులు, సీనియర్ పార్టీ నాయకులను కలుపుకుని సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు.

పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, ఓటర్ లిస్టులోని మార్పులు, చేర్పుల వివరాలతో పాటు కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురావాలని సూచించారు. పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు, కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర కృష్ణ బలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ డా. గంటా త్రిమూర్తులు, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండీ షబీనా బేగం మాట్లాడుతూ.. ప్రజల సమస్యలతో పాటు పార్టీ శ్రేణుల సమస్యలు ఏవైనా ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో మదాసు కనకదుర్గ, పార్టీ జాయింట్ సెక్రటరీ యలమంచిలి శ్రీనివాస్, క్లస్టర్లు పొత్తూరి బాపిరాజు, ఎద్దు ఏసుపాదం, ఎండీ షాబు, పామర్తి వెంకట్రామయ్య, కో-క్లస్టర్లు నేదునూరి గంగాధర్ తిలక్, గుల్లంకి శ్రీలక్ష్మి, తెలుగు యువత పట్టణ ఉపాధ్యక్షులు చెరుకు తిరుపతిరావు, కొండ్రు శ్రీనివాస్, హైమవతి, లంకి చిన్ని, విజ్జురోతి రాఘవులు, మంతి గణపతి, గొలగని రాంబాబు, యూనిట్ ఇన్‌చార్జ్‌లు, బూత్ ఇన్‌చార్జ్‌లు, వార్డు అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

పార్టీ కోసం సైనికుల్లా పని చేద్దాం