పల్నాడు ఎస్బీ సీఐ-1గా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతలు
పల్నాడు ఎస్బీ సీఐ-1గా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతలు
నరసరావుపేట, ఆంధ్రప్రభ: పల్నాడు జిల్లా పోలీస్ శాఖ స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) సీఐ-1గా సామినేని ఆంథోనీ రాజు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనను ఈ పదవిలో నియమిస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
సామినేని ఆంథోనీ రాజు ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకాలోని పలు పోలీస్ స్టేషన్లలో ఎస్సైగా సేవలందించారు. అనంతరం ప్రత్యేక అమలు విభాగం, నేర పరిశోధన శాఖ (సీఐడీ) వంటి కీలక విభాగాల్లో సీఐగా విధులు నిర్వహించి విశేష అనుభవం సంపాదించారు.
విధి నిర్వహణలో నిబద్ధత, సమర్థవంతమైన నాయకత్వం, ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండే అధికారిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. క్లిష్ట పరిస్థితుల్లోనూ చాకచక్యంగా వ్యవహరించే అధికారిగా ఆంథోనీ రాజు పేరు తెచ్చుకున్నారు.
తన సుదీర్ఘ సేవా అనుభవంతో పల్నాడు జిల్లా పోలీస్ శాఖకు మరింత సమర్థవంతమైన సేవలు అందిస్తారనే విశ్వాసాన్ని అధికారులు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది సామినేని ఆంథోనీ రాజుకు శుభాకాంక్షలు తెలిపారు.
