సమర్ధవంతమైన నాయకత్వానికి దక్కిన గుర్తింపు
సమర్ధవంతమైన నాయకత్వానికి దక్కిన గుర్తింపు
-టీడీపీ పొలిట్ బ్యూరో ఎక్స్ అఫిషియో పదవీ బాధ్యతలు -ఎంపీ శ్రీకృష్ణదేవరాయులకు అభినందన
చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : నూతనంగా టీడీపీ పొలిట్ బ్యూరో ఎక్స్ అఫిషియో పదవీ బాధ్యతలు చేపట్టిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలనుజిల్లా టీడీపీ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.ఎం.డి హనీఫ్ కలిసి అభినందనలు తెలిపారు. శ్రీకృష్ణదేవరాయులు బాధ్యతలు స్వీకరించటంతోనే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొందని, సమర్ధవంతమైన నాయకత్వానికి దక్కిన గుర్తింపు అని హనిఫ్ చెప్పారు. నూతన పదవుల నియామకం కార్యకర్తల్లో ఉత్సహానికి, నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యకర్తల్లో విశ్వాసం. నమ్మకం ఉన్న ఎంపీ శ్రీకృష్ణదేవరాయులకు ఈ కీలక పదవి లభించటం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కేడర్‌లో నూతన ఉత్సాహం వచ్చిందని హనీఫ్ అభిప్రాయపడ్డారు.
