అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : పంట సాగు చేయడం కోసం చేసిన అప్పులు తీర్చలేక, ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని మోపిడి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన మృతుని బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మోపిడి గ్రామానికి చెందిన బోయ గొర్ల జయప్ప ( 65 ) అనే రైతు తనకు ఉన్న 6 ఎకరాల భూమిలో, గత మూడు సంవత్సరాల నుండి పంటలు సాగు చేశాడు.

పంటలు సక్రమంగా దిగుబడు లు రాలేదని, మరొకవైపు పంట సాగు చేయడం కోసం 5 లక్షల రూపాయలకు పైగా అప్పులు కాగా, వాటిని తీర్చే మార్గం కానరాక తీవ్ర మనో వేదనకు గురుయ్యాడు. గ్రామ శివారులలో ఉన్న పంట పొలాలలో పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply