కోర్టుకు.. పీఎంజే చోరీ సూత్ర దారి

కోర్టుకు.. పీఎంజే చోరీ సూత్ర దారి

  • ప్రాథమిక ఆధారాలతో.. విచారణకు అనుమతి
  • కస్టడీకి మరో ముగ్గురు నిందితులు
  • కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం

కరీంనగర్ క్రైమ్, ఆంధ్రప్రభ ప్రతినిధి : జిల్లాలోని ఎంజీఎం ఆసుపత్రి అభివృద్ధి పై అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు (రిటైర్డ్ ఐపీఎస్), కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి పాల్గొన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, అడ్మిన్ కమిటీ సభ్యులు సమావేశానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆసుపత్రి అభివృద్ధి పనులు, వైద్య సేవల నాణ్యత, రోగులకు అందిస్తున్న సౌకర్యాలు, మౌలిక వసతుల మెరుగుదలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.ఈ కార్యక్రమం లో వరంగల్ జిల్లా కలెక్టర్ మరియు కమిటీ చైర్ పర్సన్ డాక్టర్ సత్య శారద, హన్మకొండ జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్,కమిటీ కన్వీనర్ ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరిచంద్రారెడ్డి పాల్గొన్నారు.

కరీంనగర్ క్రైమ్, ఆంధ్రప్రభ : కరీంనగర్ పీఎంజే జ్యువెల్లరీలో భారీ చోరీకి సూత్ర దారిగా ఉన్న గోల్డ్ థీఫ్ సుబోధ్ సింగ్ను కరీంనగర్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఇటీవలే బీహార్లోని పూర్ణియా జైలు నుంచి అక్కడి కోర్టుల నుంచి అనుమతి పొంది కరీంనగర్ జిల్లా జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న సుభోథ్ సింగ్ను విచారించేందుకు అనుమతించాలని కరీంనగర్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు నాలుగు రోజులపాటు వి చారించేందుకు అనుమతించింది.

కరీంనగర్ జ్యోతినగర్ పీఎంజే జ్యువెలరీలో మే 3న దోపిడీ ఘటన చోటు చేసుకోగా, నిందితులు షోరూం సిబ్బందిపై కాల్పులకు పాల్పడి బంగారు ఆభరణాలతో పరారైన ఉదంతం దేశంలోనే సంచలనంగా మారింది. చోరీకి పాల్పడిన గ్యాంగ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేసి ఇద్దరు దొంగలను, సిమ్ కార్డు వి క్రయించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే బీహార్ లోని పూర్ణియా జైలు నుంచే సుబోధ్ సింగ్ దోపిడీలకు వ్యూహ రచన చేస్తూ గ్యాంగ్లను పంపిస్తున్నట్టుగా గుర్తించిన కరీంనగర్ పోలీసులు చాకచక్యంగా నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.

దేశ వ్యాప్తంగా సంచలనాల కేసులకు ప్లాన్లు వేస్తూ 400 కిలోలకు పైగా బంగారాన్ని దొ చుకెళ్లడానికి మూల కారకుడు సుబోధ్ సింగేనని పోలీసులు విచారణలో తేలింది. దీంతో పీఎంజే జ్యువెలరీ షోరూంలో దోపిడీకి కూడా సుబోధ్ సింగ్ కీలక సూత్రధారి అయి ఉంటాడని అనుమానించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. దీంతో పీఎంఏ చోరీ ఘటనలోనూ సుబోధ్ సింగ్ ప్రమేయం ఉన్నట్టుగా ప్రాథమిక ఆధారాలు లభ్యం కావడంతో అతన్ని విచారించేందుకు అనుమతివ్వాలని బీహార్లోని ఆరు కోర్టులలో కరీంనగర్ పోలీసులు పీటీ వారెంట్ వేశారు.

ఇందుకు బీహార్ కోర్టులు అనుమతించడంతో సుబోధ్ సింగ్ను గత మే 28 బీహార్ నుండి కరీంనగర్ కోర్టుకు తరలించి హాజరు పరిచారు. సుబోధ్ సింగ్ను పూర్తి స్థాయిలో విచారించి జ్యువెలరీ షోరూం దోపిడీకి సంబంధించి పూర్తి వివరాలను సేకరించేందుకు చర్యలు చేపట్టారు. అలాగే ఈ కేసులో సుబోధ్ సింగ్ తోపాటు మరో ముగ్గురు నిందితులను కూడా పోలీసులు కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్నారు. కస్టడీ విచారణ లో భారీ దొంగతనానికి సంబంధించిన కీలక వివరాలు, ఇతర నిందితుల పాత్ర, చోరీ చేసిన ఆభరణాల ఆచూకీ తదితర అంశాలపై మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.