మంగళ్‌పహాడ్ గౌడ సంఘం నూతన కమిటీ ఎన్నిక
ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలంలోని మంగళ్‌పహాడ్ గ్రామంలో బుధవారం గౌడ సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
సంఘం అధ్యక్షుడిగా అనగోని అరుణ్‌కుమార్ గౌడ్, ఉపాధ్యక్షుడిగా విట్ల సాయికిరణ్ గౌడ్, క్యాషియర్‌గా దుద్దెడ సాయికృష్ణ గౌడ్, కార్యదర్శిగా చెపూర్ రవీందర్ గౌడ్ ఎన్నికైనట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.
నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు కులాభివృద్ధికి కృషి చేయాలని సంఘం సభ్యులు కోరారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను సంఘం సభ్యులు అభినందించి, వారి పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
