Peddi – LIVE | ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు పోటెత్తిన మెగా ఫ్యాన్స్ !

Peddi – LIVE | ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు పోటెత్తిన మెగా ఫ్యాన్స్ !

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో, నేడు (జూన్ 1) విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను అత్యంత వైభవంగా ఏర్పాటు చేశారు. రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్, డైరెక్టర్ బుచ్చిబాబు సన, చిత్ర యూనిట్ మొత్తం మధ్యాహ్నానికే విజయవాడ చేరుకున్నారు.

బాబాయ్-అబ్బాయ్ ఒకే వేదికపై? ఫ్యాన్స్ లో నెవ్వర్ బిఫోర్ హైప్..

సాధారణంగా ఇలాంటి పెద్ద చిత్రాల ఈవెంట్స్ హైదరాబాద్‌లో జరుగుతుంటాయి. అయితే, అందుకు భిన్నంగా ‘పెద్ది’ టీమ్ విజయవాడను ఎంచుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి తోడు ఈ మెగా ఈవెంట్‌కు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారనే ప్రచారం జరగడంతో.. ఒకే వేదికపై బాబాయ్, అబ్బాయ్‌లను చూడాలని తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి అభిమానులు స్టేడియానికి పోటెత్తారు.

Peddi | ఏపీలో గ్రీన్ సిగ్నల్.. తెలంగాణలో బ్రేక్!

Leave a Reply