Champions Trophy Finals | ముగిసిన‌ మిచెల్ పోరాటం.. కివీస్ ఆరు వికెట్లు డౌన్ !

దుబాయ్ : చాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఆరో వికెట్ ప‌డింది. భార‌త్ తో జ‌రుగుతున్న ఛాంపియ‌న్స్ ట్రోఫీ తుదిపోరులో టాస్ గెలిచి తొలుత బ్య‌టింగ్ కు దిగిన కివీస్… ఆరో వికెట్ కోల్పోయింది.

టీమిండియా స్పిన్ మంత్రానికి కివీస్ కీల‌క బ్యాట‌ర్లంతా డ‌గౌట్ కు క్యూ క‌ట్టారు. ఇప్పుడు ఆరో వికెట్ గా అర్థ‌శ‌త‌కంతో చెల‌రేగిన‌ డారిల్ మిచెల్ (63) పెవిలియర్ చేరాడు.

మ‌హమ్మ‌ద్ శ‌మీ వేసిన 46వ ఓవ‌ర్లో డారిల్ మిచెల్ (101 బంతుల్లో 3ఫోర్లు, 63) క్యాచ్ ఔట‌య్యాడు.

ప్రస్తుతం క్రీజులో మిచెల్ బ్రేస్‌వెల్ (24) – కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ఉన్నారు. 46 ఓవ‌ర్ల‌కు న్యూజిలాండ్ స్కోర్ 212/6.

Leave a Reply