KNL | ఇద్దరు బాలికలు అదృశ్యం
ఎమ్మిగనూరు : ఇద్దరు బాలికలు అదృశ్యమైన ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని ఉమ్మడి కర్నూలు జిల్లా (Kurnool District) కేంద్రంలో చోటు చేసుకున్నది. ఎమ్మిగనూరు (Emmiganur) పరిధిలోని హెచ్ బీఎస్ కాలనీలో గల అనాథ బాలికల సంరక్షణ కేంద్రంలో ఉంటున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు (Sisters) అదృశ్యమయ్యారు.
జిల్లాలోని మంత్రాలయం (mantralayam) మండలం, రచ్చుమర్రికి చెందిన కరుణాక్షి(10), స్వప్న(8) ఈనెల 29న ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లారు. అయితే నిర్వాహకులు చుటుపక్కల వెతికినా వారి ఆచూకీ లభించకపోవడంతో కేంద్రం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరు ఫూలే అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీలో చదువుతున్నారు.
