ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు ఆత్మగౌరవం

ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు ఆత్మగౌరవం

తొర్రూరు, ఆంధ్రప్రభ:
ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు ఆత్మగౌరవం పెరుగుతుందని ఎంపీడీవో కూస వెంకటేశ్వర్లు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో కూస వెంకటేశ్వర్లు పలు నూతన గృహాలను ప్రారంభించారు. ప్రతి నిరుపేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాస సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.

పేద ప్రజల చిరకాల వాంఛను ప్రజా ప్రభుత్వం నెరవేర్చిందని పేర్కొన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దిశానిర్దేశంలో ప్రభుత్వం తరఫున పేదలకు నివాస సదుపాయం అందిస్తున్నామని చెప్పారు.

రెండో విడతలో కూడా పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎంపీడీవో తెలిపారు. మండలానికి మొత్తం 607 ఇళ్లు కేటాయించగా, ప్రస్తుతం 180 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని వివరించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, సర్పంచులు జాటోతు గంగా నరేష్, బానోతు రజిని, బంగారు రమేష్, బానోతు స్వరూప, బానోతు శ్రీను, ఎండీ మహబూబ్ పాషా, ఎర్ర వెంకటేశ్వర్లు, యనమల సావిత్రి శ్రీనివాస్, చిదిరాల కృష్ణమూర్తి, నాయకులు పాల్గొన్నారు.