సమస్యలు పరిష్కరించాలి

సమస్యలు పరిష్కరించాలి

బ్యాంక‌ర్లు ​ఉపాధి కూలీలను వేధిస్తే ఊరుకోం..

సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామిరెడ్డి సూచ‌న‌

ఊట్కూర్, మే 23 (ఆంధ్రప్రభ) : ​మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని బ్యాంకు అధికారులు ఉపాధి కూలీలను వేధిస్తే ఊరుకునేది లేదని సిపిఎం నారాయణపేట జిల్లా కార్యదర్శి జీ. వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం నారాయణపేట జిల్లా ​ఊట్కూర్ మండల పరిధిలోని ఓబ్లాపూర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులపై స్థానిక నాయకులు, కూలీలు, రైతులతో కలిసి మాట్లాడారు.గ్రామంలోని కూలీల ప్రధాన డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని అధికారులను డిమాండ్ చేశారు.

​బ్యాంక్ ఖాతాల మార్పిడి: కూలీలకు ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంకులో ఉన్న అకౌంట్లను, వారికి సులభంగా అందుబాటులో ఉండేలా స్థానిక పోస్ట్ ఆఫీస్‌కు వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. ​ కెనరా బ్యాంకు అధికారుల వేధింపులు ఆపాలని కెనరా బ్యాంకులో కూలీలు తమ కష్టార్జితాన్ని డ్రా చేసుకోవడానికి వెళ్తే ఖాతాలోరూ.10,000 కంటే ఎక్కువ ఉంటేనే ఇస్తామని బ్యాంక్ సిబ్బంది మొండికేయడం ఎంతవరకు సమంజసంమని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకంలో పనులు చేపట్టేందుకు కొత్త జాబ్ కార్డులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. బ్యాంకు అధికారులు కూలీలకు సకాలంలో డబ్బులు చెల్లించాలని లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యకర్త పవన్ కుమార్ ఉపాధి కూలీలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply