ఫోన్ ట్యాపింగ్ విచారణకు ఎమ్మెల్యేల హాజరు
ఆంధ్రప్రభ, పాలమూరు: ఫోన్ ట్యాపింగ్ విచారణలో భాగంగా పాలమూరు ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు శుక్రవారం విచారణకు హాజరయ్యారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెం.13 వద్ద ఉన్న కమీషనర్ ఆఫ్ పోలీస్, ఐసీసీసీ కార్యాలయంలో వారు విచారణకు హాజరైనట్లు సమాచారం.
విచారణకు హాజరైన వారిలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఉన్నారు. అధికారులు సంబంధిత అంశాలపై వారి నుంచి వివరాలు సేకరించినట్లు తెలిసింది.
