Rs 1.1 cr | అద‌ర‌గొట్టిన వైభ‌వ్‌

Rs 1.1 cr | అద‌ర‌గొట్టిన వైభ‌వ్‌

Rs 1.1 cr | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఈ ఏడాది ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ త‌న ఆట‌తోనూ.. ఆదాయంలోనూ అద‌ర‌గొట్టాడు. సిక్స‌ర్ల వ‌ర్షం కురిపిస్తూ ఎన్నో రికార్డులను బద్దలుకొట్టాడు. దాంతో ఈ సీజన్‌లో అవార్డులన్నీ అత‌ని సొంతమ‌య్యాయి. అంతేకాకుండా ఈ సీజ‌న్‌లో ఐపీఎల్ కాంట్రాక్ట్, మ్యాచ్ ఫీజు, అవార్డుల ప్రైజ్‌మనీతో క‌లిపి కోట్ల రూపాయ‌ల‌ను సంపాదించాడు. అన్నీ కలుపుకొని వైభవ్ సూర్యవంశీ రూ.3కోట్ల‌కు పైగానే డ‌బ్బు పొందాడు. 15ఏళ్ల చిన్న వ‌య‌సులో వైభ‌వ్ ఆదాయాన్ని చూసి చాలామంది నోరెళ్ల‌పెడుతున్నారు. ఒక‌సారి వైభ‌వ్ ఈ ఏడాది సంపాద‌న ఎంతో తెలుసుకుందాం..

ఐపీఎల్ మెగా వేలంలో వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ రూ. 1.1 కోటి ధరకు సొంతం చేసుకుంది. ఐపీఎల్‌లో వైభవ్ ఫస్ట్ కాంట్రాక్ట్ కూడా ఇదే. ఈ డబ్బుతో పాటు ప్రతీ మ్యాచ్ ఆడినందుకు కూడా ఫీజు ఉంటుంది. ఒక్కో మ్యాచ్‌కు రూ. 7.5 లక్షల చొప్పున ఈ సీజన్‌లో మొత్తం 16 మ్యాచ్‌లు ఆడాడు. అంటే మ్యాచ్ ఫీజుల రూపంలో వైభవ్‌కు రూ. 1.2 కోట్లు వచ్చాయి. ఈ సీజన్‌లో అవార్డులతో వచ్చిన నగదు బహుమతుల్లో టాప్ ప్లేస్‌లో నిలిచాడు. మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్‌కి రూ. 15 లక్షలు, ఆరెంజ్ క్యాప్‌కి రూ. 10 లక్షలు, సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ది సీజన్‌కి రూ. 10 లక్షలతో పాటు టాటా సియెర్రా కారు. సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్‌కు రూ. 10 లక్షలు, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్‌కు రూ. 10 లక్షలు.. ఇలా మొత్తం అవార్డుల రూపంలో రూ. 55 లక్షల నగదు అందుకున్నాడు.

ఈ లెక్కన చూసుకుంటే కాంట్రాక్ట్ మొత్తం రూ. 1.1 కోట్లు, మ్యాచ్ ఫీజులు రూ. 1.2 కోట్లు, సీజన్ అవార్డులు రూ. 55 లక్షలు కలుపుకొంటే రూ. 2.85 కోట్లు. ప్రతీ మ్యాచ్ అవార్డులు కూడా తీసుకుంటే రూ. 3 కోట్లకు పైగానే సంపాదించాడు. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే వైభవ్ ఇండియన్ క్రికెట్‌లో అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచాడు.