వడదెబ్బతో వ్యక్తి మృతి – రంగనాథపురంలో విషాదం
వడదెబ్బతో వ్యక్తి మృతి..
రంగనాథపురంలో విషాదం
పలాస (మందస) – ఆంధ్రప్రభ : శ్రీకాకుళం జిల్లా మందస మండలం బలిగాం పంచాయతీ రంగనాథపురం గ్రామానికి చెందిన నడువురు కృష్ణారావు (35) వడదెబ్బతో మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది.
పొలానికి వెళ్లి తిరిగి వచ్చిన ఆయన ఇంటి వాకిట్లో స్రృహ తప్పి పడిపోయారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెంటనే వచ్చి చూసే సరికి అప్పటికే ఆయన మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు.
