2017case | ఇద్దరు చిన్నారుల హత్య కేసులో తల్లికి జీవిత ఖైదు..

2017case | ఇద్దరు చిన్నారుల హత్య కేసులో తల్లికి జీవిత ఖైదు..

2017case | చిత్తూరు 9వ అదనపు కోర్టు తీర్పు

చిత్తూరు, ఆంధ్రప్రభ : రామకుప్పం మండలం కవ్వంపల్లి గ్రామంలో 2017లో సంచలనం సృష్టించిన ఇద్దరు చిన్నారుల హత్య కేసులో ప్రధాన నిందితురాలు సి. పవిత్రకు చిత్తూరు జిల్లా 9వ అదనపు న్యాయస్థానం జీవితకాల కారాగార శిక్ష విధించింది. మంగళవారం న్యాయమూర్తి ఎన్. శ్రీనివాసరావు ఈ తీర్పును వెలువరించారు.

కోర్టు ఆదేశాల ప్రకారం నిందితురాలు సి. పవిత్రకు జీవిత ఖైదుతో పాటు రూ.1,000 జరిమానా విధించగా, జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మూడు నెలల జైలు శిక్ష అనుభవించాలని పేర్కొంది. అదే కేసులో రెండో నిందితుడు వేమన్నపై ఆరోపణలు రుజువు కాకపోవడంతో అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది.

2017case
2017case

పోలీసుల కథనం ప్రకారం, రామకుప్పం మండలం కవ్వంపల్లి గ్రామానికి చెందిన సి. వేమారెడ్డికి సి. పవిత్రతో వివాహం కాగా వారికి ఆరు సంవత్సరాలు, మూడు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ సమయంలో ఇంట్లో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసిన వేమన్నతో పవిత్రకు సన్నిహిత సంబంధం ఏర్పడినట్లు తెలిపారు.

ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిసిన అనంతరం మందలించి విడదీశారని, అయితే అక్రమ సంబంధానికి పిల్లలు అడ్డుగా ఉన్నారనే భావనతో ఇద్దరు నిందితులు వారిని హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. 2017 సెప్టెంబర్ 9న అంగన్వాడీ కేంద్రం నుంచి పిల్లలను ఇంటికి తీసుకువచ్చి పవిత్ర ఇద్దరు కుమారులను నైలాన్ తాడుతో ఉరివేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

అనంతరం సంఘటనా స్థలం నుంచి రూ.3 వేల నగదు తీసుకుని పరారైనట్లు వెల్లడైంది. పిల్లలు మృతదేహాలుగా కనిపించడంతో తండ్రి రామకుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్‌ఐ సురేష్‌బాబు కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తులో నైలాన్ తాడు, స్టీల్ బ్లేడ్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అనంతరం నిందితులు లొంగిపోవడంతో కేసును హత్య కేసుగా మార్చారు. ఇన్‌స్పెక్టర్ ఎం. రాజశేఖర్ దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.

విచారణ అనంతరం నేరం రుజువైన నేపథ్యంలో కోర్టు జీవిత ఖైదు విధించింది. కేసులో సమర్థవంతమైన దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శరవణకుమార్, కోర్టు సిబ్బందిని జిల్లా ఎస్పీ తుషార్ డూడి అభినందించారు.

దర్యాప్తు సందర్భంగా పోలీసులు నైలాన్ తాడు, స్టీల్ బ్లేడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులు స్వచ్ఛందంగా లొంగిపోవడంతో కేసును హత్య కేసుగా నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ ఎం. రాజశేఖర్ సమగ్ర దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.

కేసులో జరిగిన విచారణ అనంతరం నిందితులపై నేరం రుజువుకావడంతో కోర్టు వారికి జీవిత ఖైదు శిక్ష విధించింది. ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శరవణకుమార్, కోర్టు సిబ్బందిని జిల్లా ఎస్పీ తుషార్ డూడి అభినందించారు.

click here to read more

click here to read ఒకే ఇంట్లో తల్లి, కొడుకు ఆత్మహత్య