ఎన్.ఆర్.పేట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ..
ఎన్.ఆర్.పేట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ..
పెండింగ్ కేసులపై దృష్టి సారింపు
చిత్తూరు – ఆంధ్రప్రభ బ్యూరో :
చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ వెంకటనారాయణ బుధవారం ఎన్.ఆర్.పేట పోలీస్ స్టేషన్‌ను సాధారణ తనిఖీలో భాగంగా పరిశీలించారు. స్టేషన్ పరిసరాలు, రికార్డులు, పెండింగ్ కేసుల వివరాలను ఆయన క్షుణ్ణంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా కేసుల విచారణలో జాప్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. స్టేషన్ సిబ్బందితో సమావేశమైన ఆయన, విధి బాధ్యతలపై దిశానిర్దేశం చేశారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ఫిర్యాదుదారుల సమస్యలను ఓర్పుతో విని తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
పోలీసులపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా సేవలు అందించాలని డీఎస్పీ సూచించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణను మరింత బలోపేతం చేసి అనుమానాస్పద కదలికలపై నిఘా పెంచాలని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మహిళల భద్రత, సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక సదస్సులు నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజలను చైతన్యపరచి సైబర్ మోసాల నుంచి జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో పెనుమూరు ఎస్‌ఐ మణికంఠేశ్వర రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
