Meeting | ప్రొడ్యూసర్స్ వెర్సెస్ ఎగ్జిబిటర్స్
Meeting | ప్రొడ్యూసర్స్ వెర్సెస్ ఎగ్జిబిటర్స్
Meeting | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్ వ్యవస్థ పై నెలకొన్న వివాదం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఓ వైపు మెగాస్టార్ చిరంజీవితో ఎగ్జిబిటర్లు సమావేశం కావడం.. మరో వైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో నిర్మాతలు భేటీ కావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. థియేటర్ల నిర్వహణలో ప్రస్తుతం అమలవుతున్న విధానం పై ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు రావడంతో వివాదం మరింత ముదురుతుంది. ఎగ్జిబిటర్లు ‘పర్సంటేజ్ సిస్టం’ కొనసాగించాలని పట్టుబడుతుండగా.. నిర్మాతలు మాత్రం ‘రెంటల్ విధానం’ తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ.. ఈ వివాదాన్ని పరిష్కరించేది ఎవరు..?
Meeting | చిరుతో ఎగ్జిబిటర్స్ భేటీ..
మెగాస్టార్ చిరంజీవితో ఎగ్జిబిటర్లు సమావేశమై తమ సమస్యలు వివరించగా.. నిర్మాతలు పవన్ కళ్యాణ్‌తో ప్రత్యేకంగా భేటీ కావడం వెనుక రాజకీయ, వ్యాపార కోణాల పై ఊహాగానాలు మొదలయ్యాయి. సినీ పరిశ్రమలో థియేటర్ రెవెన్యూ షేరింగ్ అంశం గత కొంతకాలంగా వివాదాస్పదంగా మారింది. పెద్ద సినిమాలకు ఒక విధానం.. చిన్న సినిమాలకు మరో విధానం అమలవుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఓటీటీ ప్రభావం పెరిగిన తర్వాత థియేటర్ల ఆదాయం తగ్గిందని ఎగ్జిబిటర్లు వాదిస్తుండగా.. భారీ అద్దెలతో నిర్మాతలు నష్టపోతున్నామని నిర్మాతల వర్గం చెబుతోంది.

Meeting | నిర్మాతలకు ధైర్యం చెప్పిన పవన్
ఇప్పటికే ఈ అంశం పై పలుమార్లు చర్చలు జరిగినా స్పష్టమైన నిర్ణయం వెలువడలేదు. అయితే.. ఇప్పుడు చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో వేర్వేరుగా రెండు వర్గాలు సమావేశం కావడం ఆసక్తిగా మారింది. మరో వైపు సోషల్ మీడియాలో మాత్రం అన్నయ్యతో ఎగ్జిబిటర్లు.. తమ్ముడితో నిర్మాతలు అంటూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ వివాదం రాబోయే రోజుల్లో మరింత ముదిరే అవకాశముందని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ తో నిర్మాతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో
ఇండస్ట్రీ సమస్యల పట్ల పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో టాలీవుడ్ అగ్ర నిర్మాతలు మైత్రీ మూవీస్ రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, సాహు గారపాటి, కిలారు వెంకట సతీష్, చెరుకూరి సుధాకర్ పాల్గొన్నారు. ప్రభుత్వ పెద్దలతో జరిగిన ఈ భేటీ రాబోయే రోజుల్లో ఇండస్ట్రీకి మరింత మేలు చేకూరుస్తుందని.. నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. కంగారు పడద్దు.. అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని నిర్మాతకు పవన్ కళ్యాణ్ ధైర్యం చెప్పారని తెలిసింది. మరి.. పవన్ ఈ వివాదాన్ని పరిష్కరస్తారేమో చూడాలి.

