ఎమ్మెల్యే మండలి పుట్టినరోజు సందర్భంగా..

ఎమ్మెల్యే మండలి పుట్టినరోజు సందర్భంగా..

కోడూరు, ఆంధ్రప్రభ : అవనిగడ్డ శాసనసభ్యులు డాక్టర్ మండలి బుద్ధ ప్రసాద్ పుట్టినరోజును పరిష్కరించుకొని కోడూరు టౌన్ జనసేన పార్టీ అధ్యక్షులు కోట రాంబాబు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించగా ఈ కార్యక్రమంలో యువ నాయకులు, ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తనయుడు మండలి వెంకట్రామ్ పాల్గొని మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా వెంకట్రామ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం అభినందనీయమని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కోట రాంబాబును అభినందిస్తున్నట్లు తెలిపారు. మండల పార్టీ అధ్యక్షులు మరే గంగయ్య, కృష్ణా జిల్లా కార్యదర్శి కొండవీటి సునీత, కోడూరు పి ఎస్ ఎస్ చైర్పర్సన్ పూత బోయిన కరుణ్ కుమార్, పూత బోయిన సీతారత్న సాయిబాబు, యువ నాయకుడు బచ్చు వెంకటేష్, బడే భవనారాయణ, దావు మల్లీ, గుడిసేవ సూర్య నారాయణ, యర్రంశెట్టి దామోదర్ రావు, అప్పికట్ల వినోద్ జరుగు పోతు రాజు బచ్చు పూర్ణచంద్రరావు, చందు రామాంజనేయులు, కోట ప్రసాద్, కోట వేణుగోపాల్ పెద్ది బాబురావుతో పాటు పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.