ములుగు పట్టణంలో వరుస చోరీలు..

ములుగు పట్టణంలో వరుస చోరీలు..

  • దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు

ములుగు పట్టణం, ఆంధ్రప్రభ : ములుగు పట్టణంలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజామున వరకు వరుస చోరీ ఘటనలు చోటు చేసుకున్నాయి. రాత్రి సుమారు 1:00 గంటల నుంచి 3:00 గంటల మధ్య గుర్తుతెలియని దుండగులు పలు దుకాణాలను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం.

మహాదేవ్ ఐరన్ హార్డ్‌వేర్, జీ ఫ్యామిలీ మార్ట్, పెద్దమ్మ తల్లి వైన్స్, రెడ్డి వైన్స్ దుకాణాల్లో చోరీ జరిగినట్లు షాపు యజమానులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుకాణాల్లోని నగదు, ఇతర వస్తువులు మాయమైనట్లు యజమానులు పేర్కొన్నారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ములుగు ఎస్సై యు. ఉపేందర్ రావు తెలిపారు. దొంగలను త్వరగా గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Leave a Reply