అగ్గి రగిలితే బుగ్గే..
అగ్గి రగిలితే బుగ్గే..
అగ్నిమాపక కేంద్రం లేక ఇబ్బందులు
దూరాన అగ్నిమాపక కేంద్రం
వచ్చేసరికి బూడిదే..
స్పందించి అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలి
టేకుమట్ల, ఆంధ్రప్రభ : గ్రామాలలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. సకాలంలో ఘటనాస్థలాలకు చేరుకుని మంటలార్పితే నష్టం విలువను తగ్గించవచ్చు. మారుమూల, చివరి గ్రామాలకు అగ్నిమాపక వాహనాలు వెళ్లే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. అగ్నిమాపక కేంద్రo ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినా వాటి గురించి పట్టించుకునే వారు కరవయ్యారుఇళ్లలో దొంగలు పడితే ఒకటి రెండు రకాలుగా కోల్పోయి కొంత నష్ట పోతారు. అదే అగ్ని ప్రమాదం జరిగితే అంతా ఊడ్చుకొని పోతుంది. నిత్యం జరుగుతున్న అగ్ని ప్రమాదాలకు మండల ప్రజలు ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు. అగ్ని ప్రమాదం జరిగి మంటల ఎగసి పడే వరకు ఆర్పడానికి ప్రయత్నం చేస్తారు.

ఆ తర్వాత ఎక్కడో దూరాన ఉన్న అగ్నిమాపక కేంద్రానికి సమాచారం చేస్తారు. అయితే ఇటీవల అరటి తోట మొక్కజొన్న తోట మామిడి చెట్లు, కరెంటు స్టార్టర్లు వైర్లు ప్రమాదవశాత్తు కాలిపోతున్నాయి గతంలో మండల కేంద్రంలోని మారుతి బట్టల షాపు షార్ట్ సర్క్యూట్తో మంటలు చిలరేగంతో స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచార ఇవ్వడంతో అగ్నిమాపక శకటం వచ్చే సరికే పూర్తిగా ధ్వంసం అయ్యి బూడిద మిగులుతుంది. చేసేదేముంది బూడిదను చల్లార్చి తన కర్తవ్యం తాను నిర్వర్తించి వాళ్ళు వెళ్ళిపోతారు. సర్వం కోల్పోయి వీధిన పడుతున్నారు. అంతా అయిపోయిన తర్వాత నాయకులు అధికారులు పరామర్శాలు రావడం జరుగుతుంది ప్రమాదాలు జరిగిన వెంటనే అప్రమత్తం అయ్యి ఎటువంటి నష్టం జరగకుండా ఉండాలంటే స్థానికంగా అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలి
జిల్లాలో ఒక్కటే..
జిల్లాలో ఒక్క అగ్నిమాపక కేంద్రం ఉండడంతో దూర ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగితే వాహనం అక్కడికి వెళ్లేలోపు తీవ్రత పెరుగుతోంది. గతంలో , చిట్యాలలో అగ్నిమాపక కేంద్రాo ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసినా మోక్షం లభించలేదు. ఉన్నతాధికారులు సైతం పెద్ద సంఘటనల సమయంలో చర్చించి తర్వాత వదిలేస్తున్నారు.
అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలి
అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేస్తే ప్రజలకు మేలు చేకూరుతుంది. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు సంఘటన స్థలాలకు త్వరితగతిన చేరుకొని ఆస్తి నష్టం తగ్గించ వచ్చు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
ఫైర్ స్టేషన్ అందుబాటులో లేకనే నష్టం తీవ్రత పెరిగింది
దగ్గరల్లో అగ్నిమాపక కేంద్రం లేకపోవడంతో దూరాన ఉన్న వాహనం వచ్చే లోపు సమయం ఎక్కువ అవుతుండడంతో అగ్ని ప్రమాద తీవ్రత ఎక్కువై ఆస్తినష్టం భారీగా ఉంటుంది. అగ్నిమాపక కేంద్రం ఉంటే నష్టం తగ్గించవచ్చు. పాలకులు దృష్టి సారించాలి
