Varni | కోడి పందేల కోసం డ్రోన్ కెమెరాలతో వేట

Varni | కోడి పందేల కోసం డ్రోన్ కెమెరాలతో వేట

  • డ్రోన్ కెమెరా తో స్థలాలు పరిశీలిస్తున్న పోలీసులు.

Varni | వర్ని, ఆంధ్రప్రభ : కోడి పందాలు,పేకాట స్థావరాలపై దాడి చేయడానికి వీలుగా పోలీసులు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. ఐదు కిలోమీటర్ల వరకు డ్రోన్ ఉపయోగించడం ద్వారా ఫోటోలు వీడియోలు రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది. దీనిని వినియోగించుకొని మండలంలో వివిధ ప్రదేశాలలో నిర్వహిస్తున్న కోడిపందాలను, జూద కేంద్రాలపై దాడి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మండలంలోని హుమ్నపూర్, కోటయ్య క్యాంపు, తగిలే పల్లి ప్రాంతాలలో డ్రోన్ కెమెరా సహాయం తో ఎస్ఐ వంశీకృష్ణ పలు ప్రదేశాలను పరిశీలించారు.