కమ్యూనిస్టు ఉద్యమ ధ్రువతార పరస
కమ్యూనిస్టు ఉద్యమ ధ్రువతార పరస
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: కార్మిక నేత, కమ్యూనిస్టు ఉద్యమ ధ్రువతార సీఐటీయూ ఆంధ్ర ప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షులు పరస సత్యనారాయణ జీవితం కార్మికవర్గపోరాటాలకే అంకితమని సీఐటీయూ
జిల్లా ఉపాధ్యక్షులు జేఎన్వి గోపాలన్ అన్నారు.
పరస సత్యనారాయణ వర్ధంతిసభ శుక్రవారం భీమవరంలోని సీఐటీయూ కార్యాలయంలో జరిగింది. ముందుగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు జేఎన్వి గోపాలన్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి వాసుదేవరావు, పరస సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడారు పరస సత్యనారాయణ, చిన్నతనం నుండి సింగరేణి గని కార్మికుల కష్టాలు నిజాం పాలన నిర్బంధాలు పరస సత్యనారాయణని ఉద్యమాలు వైపు నడిపించాయని అన్నారు.
సింగరేణి కార్మికుల యూనియన్ స్థాపించి వారి హక్కుల కోసం సుదీర్ఘం పోరాటం నిర్వహించారని తెలిపారు సింగరేణి రంగమే కాకుండా రవాణా రంగం బిల్డింగ్ రంగం పరిశ్రమలు ఆర్టీసీ ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్న కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా బలమైన సీఐటీయూ ఉద్యమాన్ని నిర్మించారన్నారు. 1962లో ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో కార్మిక కర్షక ప్రజా సమస్యలపై గలమెత్తి పరిష్కారానికి కృషి చేశారన్నారు. ఈ సమాజం దోపిడీ ఈ సమాజం మారాలి దోపిడీ లేని సమ సమాజం కోసం తన జీవుతాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తి గా కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు గొర్ల రామకృష్ణ, ధనికొండ శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, కలుగీత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు జుత్తుగ నరసింహమూర్తి, తదితరులు పాల్గొన్నారు .
