ఈ నెల 22న రెడ్డిగూడెంలో ప్రత్యేక గ్రీవెన్స్
ఈ నెల 22న రెడ్డిగూడెంలో ప్రత్యేక గ్రీవెన్స్
-స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ:
ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువగా పరిపాలన అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా నియోజకవర్గ స్థాయిలోనూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించడం జరుగుతోందని.. ఈ నెల 22వ తేదీ శుక్రవారం రెడ్డిగూడెం మండలం, రెడ్డిగూడెంలోని కొత్త రెడ్డిగూడెంలో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
ఉదయం 10 గంటల నుంచి విజయ డెయిరీ కృష్ణా మిల్క్ యూనియన్ హాల్ లో కార్యక్రమం జరుగుతుందని, స్థానిక ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు కూడా పాల్గొంటారని తెలిపారు. ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పరిపాలన అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి వినతిని పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
