విధులలో నిర్లక్ష్యం వహించవద్దు

విధులలో నిర్లక్ష్యం వహించవద్దు

  • ఏ.బి హెచ్ఏ ఐడిక్రియేట్ ఇవ్వాలి.
  • అజిత్ సింగ్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ
  • జిల్లా వైద్య అధికారిని డాక్టర్ సుహాసిని

పాయకాపురం, ఆంధ్రప్రభ: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎం.సుహాసిని గురువారం అజిత్ సింగ్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ఈ తనిఖీలలో భాగంగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వస్తున్న ప్రజలందరికీ ఏ.బి హెచ్ఏ ఐడిక్రియేట్ చేయుచున్నారా లేదా అందరిని ఆధార్ కార్డు తెచ్చుకోమని చెబుతున్నారా లేదా అని పరిశీలించి, ఆన్లైన్ ప్రక్రియ పురోగతిని పరిశీలించారు.ఇదే క్రమంలో లేబరేటరీలో ప్రజలకు చేయుచున్న రక్త నమూనా పరీక్షల యొక్క వివరాలను, వారి యొక్క రిపోర్ట్ను పరిశీలించారు. ఫార్మసీ విభాగమును పరిశీలించి రోగులకు, ఇచ్చుచున్న మందులు యొక్క వివరాలను తెలుసుకొని, అత్యవసర మందులు అభ్యర్థిని కూడా ఆమె పరిశీలించారు.ఆస్పత్రిలో ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలను పరిశీలించారు.

ఆసుపత్రికి వచ్చు ప్రజలందరికీ ఈనాలుగు రోజుల్లో ఏర్పడు ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని, వడగాల్పు తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నిటిని వారికి విశదీకరించి, వారికి అవసరమైతే ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇచ్చి, ముందస్తు చర్యలు చేపట్టాలని సిబ్బందికి తెలియజేశారు.

Leave a Reply