Kharif 2026 : సాగుకు ఏపీ రెడీ Andhra Prabha Top News
Kharif 2026 : సాగుకు ఏపీ రెడీ Andhra Prabha Top News
- ఎల్‌నినో పైనే ఆందోళన
- యూరియా కొరత ప్రమాదం
- ఎరువుల పంపిణీకి ప్రత్యేక కార్డులు
- నానో యూరియా వినియోగం మంచిది
- జూన్ 1 నుంచి కాలువలకు నీరు విడుదల
- రిజర్వాయర్లలో 461 టీఎంసీల నీటి నిల్వలు
- గోదావరి, కృష్ణా డెల్టాలకు నీటి విడుదల షెడ్యూల్
- వంశధార, నాగార్జున సాగర్ ఆయకట్టులకు సాగునీరు
- కాలువల్లో పూడిక తొలగింపు పనులు వేగవంతం
- పోలవరం సహా ప్రాజెక్టులపై సీఎం సమీక్ష
( ఆంధ్రప్రభ, వెలగపూడి ప్రతినిధి)

పోలవరం సహా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహ్ంచారు. ఇటీవల విడుదల చేసిన ఇరిగేషన్ క్యాలెండర్ కు అనుగుణంగా నిర్దేశిత గడువుకు ప్రాజెక్టులు పూర్తి కావాలని దిశానిర్దేశం చేశారు.

వాటర్ మేనేజ్ మెంట్ లో సాగునీటి సంఘాలతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. భూగర్భ జలాలను సద్వినియోగం చేసుకునేలా స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికల్ని సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రులు నిమ్మల రామానాయుడు, అచ్చెంనాయుడు ,సీఎస్ సాయి ప్రసాద్, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు
Kharif 2026 : జూన్ 1 నుంచి సాగు నీరు ..

ఖరీఫ్-2026 సాగునీటి విడుదలపై మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు అధికారులకు పలు సూచనలు చేశారు. జూన్-1 నుంచి కాలువలకు నీటి విడుదల చేస్తాం. రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధంగా ఉండాలి . కాలువల్లో పూడిక తొలగింపు పనులు మే చివరికి పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. 2025-26 ఖరీఫ్‌లో 99.35 లక్షల ఎకరాలకు 888 టీఎంసీలు, రబీ సీజన్‌లో 23.67 లక్షల ఎకరాలకు 153 టీఎంసీల నీరు అందించాం . రాష్ట్ర రిజర్వాయర్లలో ప్రస్తుతం 461 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది అని మంత్రి రామానాయుడు వివరించారు.

జూన్-1 నుంచి గోదావరి డెల్టాకు , జూన్-15 నుంచి వంశధార ఆయకట్టుకు, జూలై-1 నుంచి కృష్ణా డెల్టాకు సాగునీరు అందిస్తామన్నారు. జూలై చివరికి నాగార్జున సాగర్ ఆయకట్టుకు, జూలై-15 నుంచి కె.సి కెనాల్‌కు సాగునీరు విడుదల చేస్తామని మంత్రి నిమ్మల తెలిపారు.
Kharif 2026 : యూరియా కొరత రావొచ్చు

ఖరీఫ్-2026 సీజన్ లో ఎల్ నినో (El Nino) ప్రభావంపై జిల్లాల వారీగా వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయి ఎరువులు పక్కదారి పడితే అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. యూరియా సరఫరాపై రైతులకు ప్రత్యేక కార్డులను అందచేస్తాం, అవసరం మేరకు ఆ కార్డు ద్వారా యూరియాను తీసుకోవచ్చు. ముందస్తుగా యూరియా నిల్వలు వద్దు.. రెండు, మూడు దశలలో నానో యూరియా వినియోగించాలి, అని మంత్రి అచ్చెంనాయుడు దశదిశ నిర్ధేశం చేశారు. యుద్ధం కారణంగా యూరియా దిగుమతికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది, యూరియా అవసరం మేరకు వాడాలి అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అదికారులను అప్రమత్తం చేశారు.
ALSO READ : AP CM SAVINGS : పొదుపరి గా.. చంద్రన్న Andhra Prabha Top News
