Sobhita Dhulipala| నాగచైతన్య భార్య శోభిత ధూళిపాళ
Sobhita Dhulipala| నాగచైతన్య భార్య శోభిత ధూళిపాళ
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : నాగచైతన్యకు భార్యగా మారిన తర్వాత శోభిత ధూళిపాలకు సినీ రంగంలోనే కాదు.. మోడల్ రంగంలో విలువ పెరిగింది. బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా కూడా భారీగా సంపాదిస్తున్నారు. ఆమె ఒక క్లాసీ స్టైల్ తో, గ్లోబల్ లుక్ తో కనిపిస్తుంది. అందుకే పెద్ద పెద్ద బ్రాండ్లకు ప్రమోషన్ చేసే అవకాశాన్ని దక్కించుకుంటుంది. కేవలం బాలీవుడ్, టాలీవుడ్ మాత్రమే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన శోభితకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో ఎన్నో కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయమంటూ ఆమెను కోరుతున్నారు. తాజాగా సూట్ లో స్టైలిష్ హెయిర్ స్టైల్ లో సరికొత్త ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.






























