40degrees | జ్యూస్.. బయట తాగుతున్నారా..?
40degrees | జ్యూస్.. బయట తాగుతున్నారా..?
బయట జ్యూస్‌ల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు
జ్యూస్‌లో కలిపే హానికర పదార్థాలు
అపరిశుభ్రత వల్ల కలిగే ప్రమాదాలు
ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయ పానీయాలు
40degrees | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఈ వేసవిలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. 40 డిగ్రీలకు పైగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జనం బయటకు రావడానికి జంకుతున్నారు. పని నిమిత్తం వెళ్లాల్సి వస్తే దాహంతో అల్లాడిపోతున్నారు. ఈ సమయంలో శీతల పానియాలను తాగేందుకు ఇష్టపడుతుంటారు. ఎక్కువ మంది బయట అమ్మే పండ్ల రసాలను తాగుతూ ఉంటారు. వేసవిలో ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం జ్యూస్‌లు తాగడం మంచిదే, కానీ బయట దొరికే జ్యూస్‌ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు పక్కన దొరికే జ్యూస్‌లలో నాసిరకం ఐస్‌ను ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి హానికలిగిస్తుంది. అలాగే పండ్ల రసాలలో కొన్నిసార్లు రుచి, రంగు, ఎక్కువ కాలం నిల్వ ఉండటం కోసం వాటిలో హానికరమైన రసాయనాలు, పదార్థాలను కలుపుతుంటారు. ఇవి కూడా హెల్త్‌ను పాడు చేస్తుంటాయి.
- బయట జ్యూస్ సెంటర్లలో వాడే ఐస్ మంచు గడ్డలు శుభ్రంగా ఉండవు.
- దీనివల్ల కడుపు నొప్పులు, జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
- జ్యూస్ కోసం వాడే పండ్లు తాజాగా ఉన్నాయో లేదో చూసుకోవాలి.
- తాజా పండ్లు కాకపోతే డయేరియా వంటి సమస్యలు వస్తాయి.
- బయట జ్యూస్‌లలో చక్కెర ఎక్కువగా ఉంటుంది.
- ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.
- వేసవిలో డీహైడ్రేషన్ తగ్గించడానికి కొబ్బరి నీరు, మజ్జిగ ఉత్తమమైనవి.
- జ్యూస్ రుచి, రంగు, ఎక్కువ కాలం నిల్వ ఉండటం కోసం వాటిలో హానికరమైన రసాయనాలు, పదార్థాలను కలుపుతుంటారు.
- జ్యూస్ ఆకర్షణీయమైన రంగులో కనిపించడానికి టార్ట్రాజైన్ వంటి ప్రమాదకరమైన రంగులను కలుపుతారు.
- ఇవి అలర్జీ, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.
- పండ్లలోని సహజమైన తీపి సరిపోదని, తక్కువ ధరలో ఎక్కువ తీపి కోసం శాకరిన్, ఇతర కృత్రిమ తీపి కారకాలను ఉపయోగిస్తారు.
- అధిక మొత్తంలో చక్కెరను వాడటం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది.
- జ్యూస్ పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి సోడియం బెంజోయేట్ వంటి రసాయనాలను కలుపుతారు.
- అపరిశుభ్రమైన ఐస్ జ్యూస్‌లో కలిపితే కడుపు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
- పండ్ల వాసన కోసం ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కలుపుతారు.
బయట జ్యూస్‌ల కంటే ఇంట్లోనే తాజా పండ్లతో చేసుకున్న రసాలు, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పుచ్చకాయ జ్యూస్ తాగడం చాలా మంచిది.
