ఉద్యమకారుల కమిటీ ఏర్పాటు పట్ల హర్షం

ఉద్యమకారుల కమిటీ ఏర్పాటు పట్ల హర్షం

  • కేసముద్రం మండల తెలంగాణ ఉద్యమకారులు

కేసముద్రం, ఆంధ్రప్రభ : తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి కె.కేశవరావ్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసినందుకు కేసముద్రం మండల తెలంగాణ ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఉద్యమకారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు చాగంటి కిషన్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులను త్వరితగతిన గుర్తించి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలిపారు.

కమిటీ వెంటనే విధివిధానాలు ప్రకటించి, కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలైన తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల నివాస స్థలం, డబుల్ బెడ్ రూం, ఉద్యమకారుల గుర్తింపు, మరణించిన ఉద్యమకారుల కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సహాయం, అర్హత ఉన్న ఉద్యమకారులకు ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. పిసిసి సభ్యులు గుగులోత్ దస్రూనాయక్ మాట్లాడుతూ ఎన్నికల హామీలను నెరవేర్చాలని, కమిటీ కాలయాపన చేయకుండా వెంటనే హామీలను అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో కేసముద్రం మండల ఉద్యమకారుల ఫోరం ప్రధాన కార్యదర్శి షేక్ ఖాదర్, జెఎసి పూర్వ కన్వీనర్ మోడెం రవీందర్ గౌడ్, విద్యార్థి, యువజన జెఎసి పూర్వ కన్వీనర్ దండు శ్రీనివాస్, కర్పూరపు మురళి, తోట సుధాకర్, జల్లె జయరాజ్, బాలు మోహన్, సోమారపు వెంకటయ్య, చుంచు సూరయ్య, కీర్తి సమ్మయ్య, మాందాటి ఆంజనేయులు, నానబాల దూడయ్య, నాగరబోయిన చంద్రకళ పాల్గొన్నారు.