ఆంజనేయుడి ఆలయ నిర్మాణానికి భక్తుల భారీ విరాళాలు…
రాయపర్తి, ఆంధ్రప్రభ : గ్రామంలో ఆధ్యాత్మిక శోభ పెంచేందుకు సూర్యతండా ప్రజలు కలిసికట్టుగా ముందుకొచ్చారు. మండలం లోని సూర్యతండాలో నూతన ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణం చేపట్టగా, ఆలయ పనులకు తమ వంతు సహకారం అందించేందుకు గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువకులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు ఉత్సాహంగా విరాళాలు అందించారు.శనివారం గ్రామ సర్పంచ్ బనీషా నాయక్, ఉపసర్పంచ్ మునావత్ శంకర్ నాయక్, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు, గ్రామస్థుల సమక్షంలో దాతలు చందాలు అందజేశారు.
గ్రామంలో భక్తి వాతావరణం నెలకొనగా, ప్రతి ఒక్కరూ తమ శక్తికి తగిన విరాళం ఇచ్చి ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారు.సూర్యతండా గ్రామస్థులు అందించిన విరాళాలు గ్రామానికి చెందిన గుగులోత్ జాజు, మాజీ ఎంపీటీసీ రూ. 50,116 , ఉపసర్పంచ్ మునావత్ రూ. 50,116, కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు హమ్య నాయక్ రూ. 50,116, రాజేష్ స్వామివారి తోరణం నిర్మాణానికి విరాళం ఇవ్వగా, వెంకన్న మండపం జాలి ఏర్పాటుకు తన వంతు సాయం చేశారు.
బి ఆర్ ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు నారాయణ రూ. 31,116, విజయ్ రూ. 25,116, బాలాజీ టీచర్ రూ. 25,000, ఇటుకలకు మునావత్ నవీన్, యాకు కుమారుడు ఒకటీప్పు ఇటుక రూ. 20,000 , పోలీస్ ఉద్యోగి రామావత్ సంతోష్ ఒకటీప్పు ఇటుక రూ. 20,000,మాజీ డైరెక్టర్ రవి రూ. 10,000, ఉదావత్ పంతులు రూ. 10,000, బానోతు శ్రీనివాస్ రూ. 10,000, బిలు , మునావత్ రమేష్, రామావత్ రవి తలా రూ. 5,000. విరాళాలు అందించి ఆలయ నిర్మాణానికి అండగా నిలిచారు.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణం పూర్తయితే సూర్యతండాతో పాటు పరిసర గ్రామాల భక్తులకు ఇది ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుందని అన్నారు. గ్రామస్థుల ఐకమత్యం, దాతల సహకారంతో ఆలయ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి మహోత్సవంగా ప్రారంభించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. విరాళాలు అందించిన ప్రతి దాతకు గ్రామ కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
