Narsampeta | ముత్తోజీపేటలో ఇంటింటి ప్రచారం
Narsampeta | ముత్తోజీపేటలో ఇంటింటి ప్రచారం
Narsampeta | నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గోలి అనిత శ్రీనివాస్ గెలుపు కోసం ముత్తోజిపేట 2వ డివిజన్ లో ఎన్నికల ఇంచార్జి నల్లబెల్లి మండల మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్ గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ గత కేసీఆర్. ప్రభుత్వంలో అమలైన సంక్షేమ పథకాలు, నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు గుర్తు చేయడం జరిగిందన్నారు. ఈ రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. ఈ ప్రచారంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు పోశాల లక్ష్మీ నారాయణ, తాళ్ళపెళ్ళి రాంప్రసాద్, ఎం.డీ చాంద్ పాషా, బూర సుమన్, గంగిడి విజేందర్ రెడ్డి, గుర్రం శ్రీనివాస్, బలభద్ర రవీందర్, సి.హెచ్. కుమారస్వామి, ఎన్ రెడ్డి వీరారెడ్డి, తిక్క శ్రీను, జొన్నల గడ్డ అశోక్ రెడ్డి, గంగిడి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
