అప్పుడు అందరికీ అండగా…
అప్పుడు అందరికీ అండగా…
- ఇప్పుడు ప్రాణాల కోసం పోరాటం..
- గంగాధర రాజుకు క్యాన్సర్ చికిత్సకు రూ.కోటికి పైగా ఖర్చు
- ‘మా మనిషిని కాపాడండి’ అంటూ కుటుంబ సభ్యుల వేడుకోలు
చిట్యాల, ఆంధ్రప్రభ : గ్రామంలో ఎవరికైనా కష్టం వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చే పేరు గంగాధర రాజు. ఆపదలో ఉన్నవారికి తనకు తోచిన సహాయం చేస్తూ, పలకరింపుతో పలువురికి ధైర్యం చెప్పే మనసున్న మనిషి. అలాంటి వ్యక్తే ఇప్పుడు మంచంపై క్యాన్సర్ వ్యాధితో ప్రాణాలతో పోరాడుతుండటం చిట్యాల ప్రజలను కలచివేస్తోంది.
చిట్యాల మండల కేంద్రానికి చెందిన గంగాధర రాజు గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో గత ఏడాది నుంచి చికిత్స పొందుతున్నారు. మొదట చిన్న సమస్యగా భావించిన అనారోగ్యం క్రమంగా తీవ్రమవడంతో కుటుంబం మొత్తం ఆందోళనలో మునిగిపోయింది.
ప్రాణాలను కాపాడుకోవాలనే ఆశతో కుటుంబ సభ్యులు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఇప్పటివరకు సుమారు రూ.90 లక్షలకు పైగా ఖర్చు చేశారు. తమకున్న ఆస్తులు, పొదుపులు, బంగారం… ఇలా చేతిలో ఉన్నదంతా చికిత్సకే వెచ్చించినట్లు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
అయినా వైద్యులు ఇంకా ఆరు నెలల పాటు చికిత్స కొనసాగించాల్సి ఉంటుందని, మరో రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పడంతో కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఆందోళన చెందుతున్నారు.
ఎవరైనా కష్టంలో ఉంటే ముందుండి సహాయం చేసిన మా మనిషిని ఇప్పుడు మీరు కాపాడాలి” అంటూ కుటుంబ సభ్యులు ప్రజలను వేడుకుంటున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న వైద్య ఖర్చులు భరించలేక దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.
సాయం చేయదలచిన దాతలు ఈ క్రింది నంబర్ల ద్వారా ఆర్థిక సహాయం అందించాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
ఫోన్‌పే నంబర్లు :
7702209590 – గంగాధర స్వప్న రాజు
9010553234 – గంగాధర రాజు
8099844235 – అంజల రాజు
బ్యాంక్ ఖాతా వివరాలు :
ఖాతాదారు : గంగాధర స్వప్న (భర్త : గంగాధర రాజు)
అకౌంట్ నంబర్ : 009610100176717
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ : UBIN0800961
యూనియన్ బ్యాంక్, చిట్యాల శాఖ
గమనిక : ఈ వార్తలోని గంగాధర రాజు కి సహాయం చేయదలిచి డబ్బు పంపాలనుకున్న దాతలు, వారికి ఒకసారి ఫోన్ చేసి నిర్ధారించుకుని పంపగలరు.
