Cm Cbn Operation Clean : గత పాలనలో టెర్రరిజం Andhra Prabha Top News

Cm Cbn Operation Clean : గత పాలనలో టెర్రరిజం Andhra Prabha Top News

  • గొడ్డలి ఫ్లస్​ తో వస్తారు
  • విధ్వంసం మర్చిపోతే..
  • ఆ గొడ్డలి వేటు పడుతుంది
  • ఈ రోజు నుంచే ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’
  • నాలుగో సంతానానికి ప్రోత్సాహకాలు
  • భూ తగాదాలకు చెక్..
  • రీసర్వే ప్రక్రియ వేగవంతం
  • 2047 నాటికి రూ.54 లక్షల తలసరి ఆదాయం లక్ష్యం
  • పేదరిక నిర్మూలనకు పీ4 కీలకం
  • చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి..
  • ఏపీలో ప్రత్యేక ప్లాంట్లు
  • ప్రతి ప్రభుత్వ కార్యాలయంపై
  • సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు
  • ఉత్తరాంధ్ర అభివృద్ధికి భారీ ప్రణాళికలు
  • భోగాపురం ఎయిర్‌పోర్టు జూలైలో ప్రారంభం
  • పోర్టులు, డేటా సెంటర్లతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారుతాయి
  • పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి దిశగా ప్రభుత్వం కృషి

( ఆంధ్రప్రభ, శ్రీకాకుళం బ్యూరో)

Cm Cbn Operation Clean

గత పాలకులు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. 2019-24 మధ్య అరాచకం సృష్టించారు. నరకాసురుడు అనే రాక్షసుడిని చంపిన రోజును దీపావళిగా మనం జరుపుకుంటున్నాం. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు అది. గత పాలకులు చేసిన చెడును మర్చిపోలేం గత పాలకుల విధ్వంసంతో పాటు టెర్రరిజం సృష్టించింది. అచ్చెన్నాయుడు లాంటి నేతల్ని అక్రమ కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టారు. అరాచకం చేశారు. గొడ్డలి పార్టీ ప్రజల ఆస్తుల్ని 22ఏలో పెట్టి అభద్రత సృష్టించారు. ఇప్పుడు రాష్ట్రాన్ని పునరుద్ధరించి మళ్లీ ఏపీ బ్రాండ్ ను తీసుకువచ్చాం. వాళ్లు చేసిన విధ్వంసం మర్చిపోతే మళ్లీ మనపై గొడ్డలి వేటు పడుతుంది. కులాల మధ్య, ప్రాంతాల మధ్యా చిచ్చుపెట్టి అరాచకం సృష్టిస్తున్నారు. . నేషనల్ క్రైమ్ రికార్డుల బ్యూరో అంచనాల్లో ఫేక్ న్యూస్ ప్రచారంలో ఏపీ రెండోస్థానంలో ఉంది. అంటే వైసీపీ చేసే దుష్ప్రచారాలు ఎలా ఉన్నాయో మనకు ఇట్టే అర్ధం అవుతుంది. బాబాయిని గొడ్డలితో చంపి నా చేతిలో గొడ్డలి పెట్టారు. ఇలాంటి ఫేక్ న్యూస్ లు డ్రామాలతో ప్రజల ముందుకు వస్తున్నారు . ఈసారి గొడ్డలి ప్లస్ తో ప్రజలపై పడతారు. అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

Cm Cbn Operation Clean : ఈ రోజు నుంచే ఆపరేషన్ క్లీన్ స్వీప్

Cm Cbn Operation Clean

ఈ రోజు నుంచి రాష్ట్రంలో ప్రారంభం అవుతుంది. నెలరోజు పాటు ఈ ప్రత్యేక డ్రైవ్ చేపడతాం. నాలుగు వారాల పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. మున్సిపాలిటీలు కూడా స్వచ్ఛతా అవార్డులు దక్కించుకుంటాయని ఆకాంక్షిస్తున్నాను, అని సీఎం తన సంకల్పాన్ని వివరించారు. రాష్ట్రం మొత్తం పరిశుభ్రంగా ఉండాలనే స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమం చేపట్టాం. ఇది నా మనసుకు చాలా దగ్గరగా ఉండే కార్యక్రమం ఇవాల్టి నుంచి స్వచ్ఛపథం కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా రహదారులు శుభ్రంగా ఉంచేలా ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నాం అలాగే ప్రతీ నెలా మొదటి తేదీన అర్హులు, అవసరమైన వ్యక్తులకు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా అత్యంత శ్రద్ధగా చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం లబ్దిదారులకు సరిగ్గా అందుతుందా లేదా అనేది చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నాం, అని సీఎం అన్నారు. .

Cm Cbn Operation Clean : నాలుగో సంతానానికి ప్రోత్సాహం

Cm Cbn Operation Clean

పాపులేషన్ మేనేజ్మెంట్ ద్వారా దేశానికి జనాబాను సంపదగా మార్చే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే మూడు-నాలుగో సంతానానికి ప్రోత్సాహకం ఇచ్చేలా నిర్ణయం కూడా తీసుకుంటున్నాం. ఇక రాష్ట్రవ్యాప్తంగా రీసర్వే ప్రక్రియ ద్వారా భూముల రికార్డులను ప్రక్షాళన చేసే కార్యక్రమం కూడా చేపడుతున్నాం వచ్చే ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలో ఎక్కడా భూ తగాదాలు లేకుండా చేసే బాధ్యత కూటమి ప్రజా ప్రభుత్వానిది అధికారంలోకి వచ్చాక 17వ సారి స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్నాను. కేవలం మన పరిసరాలు, ఇల్లు, కార్యాలయాలే కాదు అన్ని ప్రాంతాలూ పరిశుభ్రంగా ఉండేలా మన అలవాట్లూ మారాలి సమాజంలో మార్పు వస్తేనే స్వఛ్చాంధ్ర లక్ష్యం సాధ్యం అవుతుంది. 2047 స్వర్ణాంధ్ర విజన్ రూపోందించుకున్నాం, అని సీఎం స్పష్టం చేశారు.

Cm Cbn Operation Clean : రూ.54లక్షల తలసరి ఆదాయం లక్ష్యం

Cm Cbn Operation Clean

2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఏపీని తీర్చిదిద్దటంతో పాటు రూ.54 లక్షల తలసరి ఆదాయం తీసుకురావటం మా ప్రభుత్వ లక్ష్యం. సమాజంలో ఆర్ధిక అసమానతలు తగ్గించి అందరి జీవన ప్రమాణాలు పెంచటమే ఆలోచనగా పనిచేస్తున్నాం సంక్షేమం, అభివృద్ధికి కూడా నిధులు కావాలి. సంపద సృష్టిస్తేనే సంక్షేమం చేయగలం. పేదవాళ్లకు చేయూతను ఇచ్చేలా పీ4 కార్యక్రమం చేపట్టాం. మార్గదర్శి బంగారు కుటుంబాలుగా వ్యవహరించి పేదరికాన్ని రూపుమాపేలా ప్రయత్నం చేస్తున్నాం సమాజంలో సంపద కలిగిన 10 శాతం మంది దిగువన ఉన్న 20 శాతం మందిని ఆదుకునేలా పీ4 కార్యక్రమం చేపట్టాం 2047 నాటికి ప్రపంచంలోనే అగ్రస్థాయి దేశంగా భారత్ మారుతుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో ఈ లక్ష్యం సాధిస్తాం, అని సీఎం ధీమా వ్యక్తం చేశారు.

Cm Cbn Operation Clean : చెత్తను అప్పగించారు

Cm Cbn Operation Clean

86 లక్షల టన్నుల చెత్తను గత పాలకులు వదిలేసి వెళ్లారు. దానిని తొలగించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాం. చెత్త నుంచి విద్యుత్ తయారు చేసేలా ప్లాంట్లను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నాం. ప్రతీ ప్రాంతంలో వస్తున్న చెత్త కాంపోస్టుగా, సర్క్యులర్ ఎకానమీ లేదా విద్యుత్ తయారీ ప్లాంట్లకు తరలించేలా ప్రయత్నం చేస్తున్నాం . రాష్ట్రవ్యాప్తంగా చెత్తను వేరు చేయడానికి సెగ్రిగేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేసాం తద్వారా డంపింగ్ యార్డులకు స్వస్తి పలుకుతున్నాం . నెట్ జీరో క్యాంపస్‌లుగా రాష్ట్రంలోని హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లను తయారు చేస్తున్నాం. వ్యర్ధాలు లేకుండా వాటిని స్వచ్ఛమైన క్యాంపస్ లు గా రూపోందిస్తున్నాం.

Cm Cbn Operation Clean : ప్రతీ ఆఫీసుకి సోలార్​ రూఫ్​ టాప్​

Cm Cbn Operation Clean

ప్రతీ ప్రభుత్వ కార్యాలయం పైనా సోలార్ రూఫ్ టాప్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించాం. ముస్తాబు కార్యక్రమం ద్వారా విద్యార్ధులలోనూ పరిశుభ్రతను, ఆత్మవిశ్వాసాన్ని నేర్పేలా అమలు చేస్తున్నాం. స్వచ్ఛ రధాల ద్వారా ఘన వ్యర్ధాలు, ఎలక్ట్రానిక్ వ్యర్ధాలను సేకరిస్తున్నాం. రాష్ట్రంలోని ప్రాంతాలను 33 శాతం పచ్చదనం వచ్చేలా లక్ష్యాలను నిర్దేశించాం., అని సీఎం స్పష్టం చేశారు.

Cm Cbn Operation Clean : ఇక ఉత్తరాంధ్రాకే వలస వస్తారు

Cm Cbn Operation Clean

ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయటంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలనే ప్రజాప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. విశాఖకు గూగుల్ కంపెనీ వస్తే రాయలసీమకు ఫైటర్ జెట్ ప్లాంట్ తీసుకువచ్చాం. ఉత్తరాంధ్ర నుంచి వలసలు వెళ్లటం కాదు ఉత్తరాంధ్రకే ఇతర ప్రాంతాల నుంచి వలసలు వచ్చేలా సంకల్పం తీసుకున్నాం. పోర్టులు, ఎయిర్ పోర్టులు, ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లతో ఉత్తరాంధ్ర దశాదిశా మారుతుంది. లక్ష కోట్లతో రిలయన్స్ కూడా డేటా సెంటర్, కాగ్నిజెంట్, టీసీఎస్ లాంటి ఐటీ కంపెనీలు వస్తున్నాయి. భోగాపురం ఎయిర్ పోర్టు జూలైలో ప్రారంభించబోతున్నాం. మూలపేట పోర్టుతో అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతుంది. పలాసలో కూడా మరో ఎయిర్ పోర్టు కూడా నిర్మించాలని ఆలోచన చేస్తున్నాం. మంచి వనరులు కూడా ఉన్న జిల్లా శ్రీకాకుళంమనం అంతా కలిసి ఓ టీమ్ గా శ్రీకాకుళం జిల్లాలను అభివృద్ధి పథంలో నిలుపుదాం.మద్దువలస స్టేజ్ 2 జనవరి 2027 ప్రారంభించబోతున్నాం, హీరమండలం ఎత్తిపోతల 2027 ఏప్రిల్, వంశధార ఫేస్ 2 స్టేజ్ 2 జూలై, జంఝావతి 2027 నాటికి పూర్తి చేస్తాం నేరడి బ్యారేజ్ 6 దశాబ్దాల కల. వచ్చే మూడేళ్లలో ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాను . దీర్ఘకాలం పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేలా కృషి చేస్తాం. అయితే కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారు, అపి సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు.

ALSO READ : Kanaka Durga Train : కనక దుర్గ రైలుకు గ్రీన్​ సిగ్నల్​ Andhra Prabha News