20kilograms | నేపాలీ దంపతుల అరెస్ట్

20kilograms | నేపాలీ దంపతుల అరెస్ట్
20kilograms | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. యజమాని ఇంట్లోనే దోపిడీకి పాల్పడిన నేపాలీ దంపతులతో పాటు మరో మహిళను పోలీసులు అరెస్టు చేశారు. నేపాల్ సరిహద్దులో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది నేపాలీ ముఠా సభ్యులు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న విశ్రాంత ప్రొఫెసర్ దంపతులను కట్టేసి దోపిడీకి పాల్పడ్డారు.
నిందితులు 75 తులాల బంగారం, 20 కిలోల వెండి, రూ.30 వేల నగదు, 3 వేల డాలర్లతో పరారైనట్లు పోలీసులు తెలిపారు. మమత, ఆమె భర్త రమేశ్‌తో పాటు సబీనాను అరెస్టు చేసిన పోలీసులు మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
