అక్కడ సెల్ సమస్యలు..

అక్కడ సెల్ సమస్యలు..
భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో : నేడు నిత్యజీవితంలో సెల్ ఫోన్(cell phone) అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. నీరు, ఆహారం ఎంత ముఖ్యమో అంతే ముఖ్యంగా మారిపోయింది. సామాన్యుడికి సైతం సమాచారాన్ని చేరవేయడంలో, యోగక్షేమాలను తెలుసుకోవడంలో, సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో, సహాయాన్ని పొందడంలో ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ కీలక భూమిక పోషిస్తుంది.
తుఫాన్(storm) తీవ్ర ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లాలో సెల్ ఫోన్లకు సిగ్నల్ అందడం లేదు. మూడు రోజులుగా ప్రజలు ఫోన్లు మాట్లాడేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇంటర్నెట్(internet) పై ఆధారపడి ఇంటి వద్ద నుండే ఉద్యోగాలు చేసుకునే (వర్క్ ఫ్రం హోం) సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. సెల్ టవర్ వద్ద సిగ్నల్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు కొన్నిచోట్ల డీజిల్ ఇంజన్ల(diesel engines)ను, జనరేటర్ లను ఏర్పాటు చేసిన అవి పూర్తి స్థాయిలో పనిచేయకపోవడంతో సిగ్నల్ సమస్యలు అధికమవుతున్నాయి.
ముఖ్యమైన సమాచారాలను చేరవేయాలంటే ఆరు బయటకు వచ్చి అవస్థలు పడాల్సి వస్తుంది. త్వరితగతిన సిగ్నల్ సమస్యలు లేకుండా పరిష్కరించాలని మొబైల్ వినియోగదారులు కోరుతున్నారు.
