చౌటుప్పల్‌లో నిలిచిన మిషన్ భగీరథ నీరు

చౌటుప్పల్‌లో నిలిచిన మిషన్ భగీరథ నీరు

  • యాదాద్రి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

​చౌటుప్పల్, ఆంధ్రప్రభ: చౌటుప్పల్ మండల పరిధిలోని పలు గ్రామాలకు మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఎస్.డబ్ల్యూ లింగోటం పరిధిలోని 70 ఎంఎల్ డీ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ట్రాన్స్‌ఫార్మర్ యార్డ్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా ఈ నెల 14వ తేదీ తెల్లవారుజామున 5 గంటల నుంచి నీటి సరఫరా నిలిచిపోయిన నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంబంధిత అధికారులతో శుక్రవారం అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆదనపు కలెక్టర్ భాస్కరరావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్యదర్శులు తక్షణమే స్పందించి తమ పరిధిలోని స్థానిక బోర్‌వెల్స్‌ను గుర్తించి వాటి ద్వారా ప్రజలకు నీటిని అందించాలని ఆదేశించారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా నీటిని పంపిణీ చేయాలని సూచించారు. మిషన్ భగీరథ నీటి సరఫరా పునరుద్ధరణ జరిగే వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు త్రాగునీటి కొరత రాకుండా చూడాలని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు.

​సాంకేతిక సమస్యను త్వరితగతిన పరిష్కరించి, నీటి సరఫరాను పునరుద్ధరించేందుకు యుద్ధప్రతిపాదికన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు.ఈ సమావేశంలో ఆర్డిఓ వి శేఖర్ రెడ్డి, ఎంపీడీఓ సందీప్ కుమార్, డివిజనల్ ఇంజనీర్ దీన్ దయాల్ రావు, ఏఈఈ తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply