ఉపాధి పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలి

ఉపాధి పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలి
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : ఉపాధి హామీ పనులను జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో చింత.రాజ శ్రీనివాస్ పేర్కొన్నారు.శుక్రవారం కమ్మర్ పల్లి మండలం నాగపూర్ గ్రామంలోని చెరువులో జరుగుతున్న పూడికతీత పనులను ఎంపిడివో రాజ శ్రీనివాస్ క్షేత్ర స్థాయిలో సందర్శించి,పరిశీలించి,మస్టర్ రోల్ లో కూలీల హాజరు తీసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పని ప్రదేశంలో కల్పిస్తున్న మౌళిక వసతులపై ఫీల్డ్ అసిస్టెంట్ ను ఆరా తీసి పలు సూచనలు చేశారు. ఉపాధిహామీ పనులకు కూలీలు ఎక్కువ సంఖ్యలో వచ్చేలా చూడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ రాజేశ్వర్,మేట్లు,కూలీలు తదితరులు పాల్గొన్నారు.
