కాంగ్రెస్ కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత..

చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ తో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ పేద కుటుంబాలకు శనివారం స్థానిక రాజీవ్ స్మారక ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రావుల మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం చేసినట్లుగా ట్రస్ట్ కార్యదర్శి ఎంఏ ఖయ్యూం తెలిపారు.

మున్సిపాలిటీలోని బంగారుగడ్డ కు చెందిన జహంగీర్ ఖాన్, హసీనాబేగం, అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన పెండెం ఉమారాణి, ముద్దం నాగేష్ గౌడ్ ల కుటుంబాలకు ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున ఖయ్యూం చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ముద్ధం సుమిత్ర సత్తయ్య గౌడ్, నాయకులు నల్ల నరసింహ, ఆవుల యేసు, ఏజాజ్ పాషా, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply