నిరుపేద కుటుంబానికి భరోస గా..
కేసముద్రం, ఆంధ్రప్రభ : కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని సంతోష్ నగర్ కాలనీ 15వ వార్డుకు చెందిన రామిళ్ల ఉపేంద్ర (48) కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ మృతి చెందారు. ఈనేపధ్యంలో
ఈ విషయం స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు , మాజీ ఉపసర్పంచ్ పోలేపాక నాగరాజు, స్థానిక కౌన్సిలర్ సునీతాబధ్యా నాయక్ విషయం తెలియజేసి భీద కుటుంబానికి సహాయం చెయ్యాలని సమ్మిగౌడ్ కి తెలియజేయగా వెంటనే చిలువేరు సమ్మయ్య గౌడ్ మానవత్వంతో స్పందించారు.
సమ్మిగౌడ్ అందుబాటులో లేకపోయినప్పటికీ, తన ప్రతినిధుల ద్వారా బాధిత కుటుంబానికి బియ్యం, నిత్యావసర సరుకులను అందజేసి,కష్టకాలంలో తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ సునీతా భద్రు నాయక్ , బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పోలేపాక నాగరాజు, డాక్టర్ ఏకాంతం,న్యూ డెమోక్రసీ నాయకులు శివారపు శ్రీధర్, అంగోత్ మంగీలాల్, యువనాయకులు సాయి చరణ్, చంద్రమౌళి, రమేష్, బాలాచారి, అశోక్, విజయ్, యాకబ్రం, సుదర్శన్, వెంకన్న, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
